కలుపు యాజమాన్యం
శ్రీ పద్ధతిలో నీళ్ళు నిలగట్టక పోవటం వల్ల కలుపు ఎక్కువగా వుంటుంది. కలుపును చేతితో తియ్యటానికి బదులు దానిని నేలలోకి కలిపెయ్యాలి . ఇందుకు విడర్ పరికరం ఉపయోగపడుతుంది. కలుపు పచ్చిరోట్టల పనికొస్తుంది. కాబట్టి దానిని పెరగనిచ్చి తరువాత నేలలోకి కలుపుతూ వుండాలి. నాటు వేసిన 10 వ రోజున ఒకసారి, 20వ రోజున మరొకసారి పంటలో రెండు వైపులా విడర్ నడిపితే కలుపు సమస్య చాలావరకు పరిష్కరమవుతుంది. ౩౦వ రోజు, 40 వ రోజు వాడటం వల్ల వరి మొక్కల వేళ్ళు గాలి పోసుకుని బలంగా పెరుగుతాయి. పిలకలు బాగా పెడతాయి.
ప్రతి రెండు వరసల మధ్య ఈ విదర్నీ ముందుకి, వెనక్కి తోస్తూ నడపాలి. కలుపు మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడే అంటే నాటు వేసిన 10 రోజులకు మొదటిసారి విడర్ తిప్పాలి. వరి మొక్క నాజుకుగా వున్న, కలుపు తక్కువుగా వున్నా అవారాన్ని బట్టి విడర్ తో కాకుండా మనుషులతో కలుపు తీయిం చాలి. తొలిసారి కలుపు తీసిన తరువాత ప్రతి 10 రోజులకు ఒకసారి విడర్ ని తిప్పాలి.